Friday, December 20, 2024

ఒడిశాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్‌ః ఒడిశాలో మరో ఘోర రోడ్డు ప్రమాదరం జరిగింది. మంగళవారం ఉదయం కోరాపుట్ జిలాలోని పుంగర్ వద్ద ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన యాసిడ్ ట్యాంకర్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఒడిశా జైపూర్ నుంచి కారులో విశాఖకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, సోమవారం ఒడిశాలోని జంగాంలో జిల్లాలో రెండు బస్సులు ఢీకొని 12మంది దుర్మరణం చెందిన విషయం తెలసిందే.

Also Read: బోరబండలో దారుణం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News