అమరావతి: తూర్పు కాపులు ఎక్కువగా వలసలు వెళ్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో పవన్ పర్యటిస్తున్నారు. జనసేన అధినేత పవన్ సమక్షంలో తూర్పు కాపునేతలు జనసేన పార్టీలో చేరారు. సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చామని తూర్పు కాపు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. వంశధార నిర్వాసితుల్లో ఎక్కువ మంది కాపు నేతలు ఉన్నారని, దేశంలో ఏ నిర్మాణం వెనుకైనా ఉతరాంధ్ర తూర్పు కాపులు ఉన్నారని ప్రశంసించారు. తూర్పు కాపుల జనాభాపై ఒక్కో ప్రభుత్వం ఒక్కో లెక్క చెబుతోందని, జనసేన వస్తే ముందుగా గణాంకాలు తీస్తామని పవన్ హామీ ఇచ్చారు. తెలంగాణ సమాజంలోనూ తూర్పు కాపుల సంఖ్య ఎక్కువగానే ఉందని, సమాజానికి ఎంతో చేస్తున్న తూర్పు కాపులకు ఏమివ్వాలన్న ఆలోచన మొదలైందన్నారు.
Also Read: ఈటల రాజేందర్ హత్యకు కుట్రః ఈటల జమున సంచలన ఆరోపణలు