ఢిల్లీ: సిఎం కెసిఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై చర్చించామని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఎఐసిసి కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికల కార్యాచరణను కాంగ్రెస్ ప్రారంభించిందని, వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించాలని చెప్పారన్నారు. కర్నాటకలో అవలంభించిన కొన్ని వ్యూహాలు తెలంగాణలో అమలు చేస్తామని, కర్నాటకలో తరహాలోనే తెలంగాణలోనూ భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.
Also Read: ఎలుగుబంటిని చంపి… భర్త, సోదరుడిని కాపాడిన మహిళ