Friday, January 3, 2025

పురపాలకలో ఇంటింటికీ బిజెపి

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : పురపాలకలోని 85వ బూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీకర్ ఆధ్వర్యంలో మంగళవారం పాత బజార్ హనుమాన్ నగర్ రావి చెట్టు వీధిలో బిజెపి నాయకులు ఇంటింటికీ బిజెపి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెడితే రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మొగిలి దుర్గా ప్రసాద్, పట్టణ అధ్యక్షులు బొడ నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు నీరుకంటి రాఘవేందర్ గౌడ్, బిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్ల రవి గౌడ్, బిజెపి నాయకులు హరికృష్న శర్మ, లక్ష్మి నరసింహ, ప్రవీణ్, హేమంత్, అబ్బు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News