Monday, December 23, 2024

బిసి కులవృత్తుల ఆర్థికసాయం జాబితా సిద్ధం చేయాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్: వెనుకబడిన తరగతుల కుల వృత్తుల వారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కుటుంబంలో ఒకరికి లక్ష రూపా యల ఆర్థిక సహాయం అందించేందుకు ఈనెల 29 వరకు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికా రులను ఆదేశించారు.

మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ, బీసీ లబ్ధిదారులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం క్రింద జిల్లావ్యాప్తంగా 11 వేల దరఖాస్తులను స్వీక రించడం జరిగిందన్నారు. వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులను గుర్తించాల్సిన అవసరం ఉం దన్నారు. లబ్ధిదారుల ఎంపికకు క్షేత్రస్థాయిలో మున్సిప ల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పూర్తి బాధ్యతతో పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసి ఈనెల 29 వరకు అందజే యాలన్నారు. 18 సంవత్సరాల నుండి జూన్ 2 నాటికి 55 సంవత్సరాలు పూర్తయిన వారు అర్హులన్నారు.

గత ఐదు సంవత్స రాల కాలంలో సంక్షేమ శాఖల ద్వారా 50 వేల రుణాలు పొంది ఉన్నవారు అర్హులు కారని సూచించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద నంది పొందిన వారు అర్హులని తెలిపారు. లబ్ధిదారులు కచ్చితంగా వెనుకబడిన కులాలకు చెందిన వారై కులవృత్తులు, చేతివృత్తులపై ఆధారపడిన వారే అర్హులన్నారు. ఈరోజు నుండే వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో ము న్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని సూచిం చారు. ఈ పనులలో నిర్లక్ష్యం వహించరాదని, ఇందుకుగాను పనులను సజావు గా నిర్వహించేందుకు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందన్నారు.

వర్షా కాలం ప్రారంభమైనందున వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువు లను విక్రయించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిర్మించాలని సూచించారు. రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసా య శాఖ అధికారులు అందుబాటులో ఉండి వారికి అవసర మైన సూచనలు సలహాలు అందించాలని అన్నారు. రైతుబ ంధు రైతు బీమా అందరికీ సకాలంలో అందేలా చూడా లని ఆదేశించారు. జిల్లాలో వర్షాలు బాగా పడుతున్న ందున 9వ విడత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అన్నారు. లక్ష్యం మేరకు గుంతలను తవ్య కార్యక్రమం చేపట్టి సిద్ధం చేయాలని సూచించారు.

గత అనుభవాలకు అనుగుణంగా సరైన గుం తలతో పాటు సక్రమంగా మొక్కలు నాటాలని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌కు పెద్ద సైజు ముక్కలు నాటి వాటిని సంర క్షించాల్సిన బాధ్యత ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లదే అని అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణ కు సంబంధించి ఇప్పటివరకు ఎంపిక కాని స్థలాలను వెంటనే మూడు రోజులలో పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News