నర్సంపేట: తెలంగాణ దళిత బాంధవుడు సిఎం కెసిఆర్ అని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సాధు నర్సింగరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మాల మహానాడు జిల్లా కమిటీ అత్యవసర సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి కోతి విష్ణు, జిల్లా కార్యదర్శి కూనమల్ల కమలాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సాధు నర్సింగరావు హాజరై మాట్లాడుతూ.. దళితుల సాధికారత కోసం సిఎం కెసిఆర్ ఎంతో మేదోమథనం చేసి దళిత బంధు పథకం లాంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన కెసిఆర్ తెలంగాణ దళిత బాంధవుడన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం 119అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మంది దళిత లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఇవ్వడం చారిత్రకమైన అంశమన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గ దళిత సామాజిక వర్గ అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారని దళిత ప్రజలు పెద్దికి రుణపడి ఉంటారన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గత 50 ఏళ్లుగా పోడు భూమిని సేద్యం చేసుకుంటున్న నిరుపేద వర్గాలకు పోడు భూమి పట్టాలు ఇవ్వాలని, ఈ సందర్భంగా రెండో విడత దళిత బంధు ప్రకటించిన సిఎం కెసిఆర్, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శంకర్, డివిజన్ అధ్యక్షుడు పత్రి కుమార్, ఉపాధ్యక్షుడు కడగండ్ల అశోక్‌రావు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు పడిదం రాజేందర్, మండలాల అధ్యక్షులు అశోద నర్సింగం, పీసరి రంజీత్‌కుమార్, ఈద విజేందర్, బక్కి కుమార్, నాయకులు కృష్ణాకర్, అనిల్‌కుమార్, కరుణాకర్, బాబు తదితరులు పాల్గొన్నారు.