అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారులోని కుంట్లూరు పాపాయిగూడ భూదాన్ భూములో భూ పోరాటం చేస్తున్న సిపిఐ నేతల పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆర్దరాత్రి సిపిఐ నేతల ఇళ్లకు వెళ్లి పోలీసులు అరెస్టు చేసి హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులతో భూపోరాటలను అపే ప్రసక్తి లేదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సామిడి శేఖర్‌రెడ్డి, పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ 12వ వార్డు కౌన్సిలర్, జిల్లా ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ చారి తెలిపారు. గత కొంత కాలంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు పాపాయిగూడ భూదాన్ భూములో జరుగుతున్న గుడిసెల భూ పోరాట చేస్తున్న సిపిఐ నాయకుల పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అందులో భాగంగా మంగళవారం తెల్లవారుజాములన హయత్‌నగర్ పోలీసులు శేఖర్‌రెడ్డి, పబ్బతి లక్ష్మణ్, వేణుగోపాల్‌చారీలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోర్టు తరలించి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం కోసం పాపాయిగూడలోని భూదాన్ భూముల్లో సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం ప్రారంభించామని తెలిపారు. ఈ భూ పోరాటంలో వేలాది మంది నిరుపేదలు గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారని, వారికి అండగా ఉన్న సిపిఐ నేతల పై అన్యాయంగా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్లు కమ్యూనిస్టులు భయపడేవారు కాదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించిన నిరంతరం పేదలకు ఇంటి స్థలం దక్కె వరకు పోరాటం సాగిస్తామని తెలిపారు.