Tuesday, December 24, 2024

ఉద్యమ స్ఫూర్తి పురస్కారాల ప్రదానం

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : తెలంగాణ రాష్ట్ర సాకారంకు జీవితాలను ఫణంగా పెట్టిన అమరవీరుల త్యాగాలను మరువలేమని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. సీఎం కెసిఆర్ అమరవీరుల కుటుంబాలకు తగిన గుర్తింపు ఇచ్చారని ఆయన కొనియాడారు. శ్రుతిలయ ఆర్ట్ అకాడమీ, సీల్‌వెల్ కార్పొరే షన్ సంయుక్తా ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పురస్కారాల ప్రదానోత్సవ సభ చిక్కడపల్లిలోని, శ్రీత్యాగరాయగాన సభలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దామోదర్ పాల్గొని పలువురికి పురస్కారాలు బహూకరించి, మాట్లాడారు. 1969లో తెలంగాణ తొలి పోరాటంలో ఎందరో మృతి చెందినా రాష్ట్ర సాధన జరుగలేదని మలిదశ పోరాటం కెసిఆర్ నాయకత్వంతో గాంధీజి మార్గంలో అహింసా మార్గంలో రాష్ట్రం ఏర్పడిందన్నారు.

తొమ్మిది ఏళ్ల పాలన లో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతిలో ఉందన్నారు. స్ఫూర్తి పురస్కార గ్రహీత నాటి ఉద్యోగ సంఘం నాయకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. మేము ఉద్యోగులం తెర ముందు ఉండి ఉద్యమంలో పాల్గొనగా తెర వెనుక ఎందరో ఆత్మత్యాగం చేసుకున్నారని వారికే ఈసత్కారం దక్కుతుందన్నా రు. తెలంగాణ సమాజం అమర వీరుల త్యాగ నిరతిని సదా స్మరిస్తూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వంశీ సంస్థల అధినేత డా.వంశీరామరాజు మాట్లాడుతూ.. సంస్థ నిర్వాహకులు ఆమని నిరంతరం సాంస్కృతిక సామాజిక కార్యక్ర మాల నిర్వహణలో దిట్ట అన్నారు. ఇలాంటి ఆమేకు రవీంద్రభారతి కార్యదర్శిగా లేదా సాంస్కృతిక శాఖలో ఏదైన పదవి ఇస్తే మా సంస్థలకు ఆనందం అని కోరారు. పట్టాబి, రామకృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, సతీష్‌రెడ్డి, ఆనందరాజు తదితరులు స్ఫూర్తి పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. సంస్థ అధ్యక్షుడు భీమ్‌రెడ్డి సభాధ్యక్షత వహించిన సభకు ఆమని స్వాగతం పలికారు. తొలుత ప్రముఖ గాయనీ ఆమని, సుభాష్ తదితరులు పాడిన పాటలతో పాటు నటి పూర్ణిమ తన పాటలతో ప్ర త్యేక ఆకర్షణగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News