Friday, December 20, 2024

దివ్యాంగులకు రాజకీయల్లో రిజర్వేషన్లు కల్పించాలి  

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : దివ్యాంగులకు రాజకీయల్లో రిజర్వేషన్లు కల్పించాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ లయన్ ఎం.ప్రేమ్ కుమార్ అన్నారు. అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల సారధి హెలెన్ కెల్లర్ 143వ జయంతి వేడుకలు మంగళవారం త్యాగరాయగానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రేమ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగి ంచారు. సమాజంలో వికలాంగులపై సానుభూతి చూపించడం కాదు, వారికి సమాన అవకాశాలు కల్పించాలని వివిధ రాజకీయ పార్టీలను ఆయ న కోరారు. రాబోయే రోజుల్లో వికలాంగులను ఐక్యత పరిచి వికలాంగుల ఓటు బ్యాంక్ సమాజానికి తెలియజేస్తామని పేర్కొన్నారు.

అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు సభాధ్యక్షత వహించి, మాట్లాడుతూ.. దళిత బంధు మాదిరిగానే వికలాం గుల బంధు ప్రకటించాలన్నారు. అదేవిధంగా వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్‌లో 10శాతం ఇవ్వాలని, బ్యాక్లాక్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాని కోరారు. ఈసందర్భంగా పలువురి వికలాంగులకు దుప్పట్లు, టిషర్టులను అందజేశారు. కార్యక్రమంలో సాహితీవేత్త చిక్కా రామదా సు, లయన్.పి. ఉమర్‌ఖాన్, సామాజికవేత్త డా.వీరభోగ వసంతరాయులు, పంది శ్రీనివాస్, ఏడుకొండలు, పులిపాటి శ్రీనివాసు, గోవిం దరాజు, ఉమా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News