Monday, December 23, 2024

గ్రామ రైతు సమన్వయ సమితి డైరెక్టర్ల నియామకం

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ : రాజంపేట్ మండల కేంద్ర గ్రామ రైతు సమన్వయ సమితి డైరెక్టర్లను ప్రభుత్వ విఫ్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంగళవారం నియమించారు. గతంలో పని చేసిన డైరెక్టర్లు అనారోగ్యా కారణంగా మృతి చెందడంతో గత కోంత కాలంగా పెండింగ్‌లో ఉన్న డైరెక్టర్ల స్థానంలో నూతనంగా చందాపురం రాజిరెడ్డి, కట్లకుంట్ల సిద్దిరాములు, దోబ్బల గంగారంలకు అవకాశం కల్పించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విఫ్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ… రైతులకు అందుబాటులో ఉండి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వ్యవసాయ అధికారుల సమన్వయంతో కాలనుగూణంగా వచ్చే పంటలపై అవగాహన, సలహాలు, సూచనలు అందించి రైతుల పక్షాన ఉండాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎంపికయిన డైరెక్టర్లు ప్రభుత్వ విప్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మిఠాయిలు తినిపించారు.

తమపై నమ్మకంతో రైతు సమన్వయ సమితి గ్రామ డైరెక్టర్లుగా అవకాశం కల్పించినందుకు నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రతి కార్యక్రమంలో భాగసౌమ్యం అయి పార్టీ ప్రతిష్టత కోసం, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News