Friday, November 15, 2024

ఓటరు నమోదుకు స్పెషల్ డైవ్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ఓటరు నమోదు కోసం స్పెషల్ డైవ్‌ను నిర్వహించడం జరుగుతుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అ న్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికలాంగులైన ఓటర్ల కోసం ఎన్నికల సంఘం మరిన్ని సౌకర్యాలను కల్పించిం దని, దానికి అనుగుణంగా వికలాంగులైన ఓటర్లు ఫారం -8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల సంఘం (పీడబ్లుడీ) వికలాంగులైన ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ బూత్‌ల వద్ద సౌకర్యాలను కల్పించే దిశగా చర్యలను చేపట్టడం జరిగిందని తెలిపారు. వికలాంగులైన వారు ఫారం -8 ద్వారా ఎటువంటి ధృవీకరణలను జత చేయాల్సిన అవస రం లేకుండా, వారు వికలాంగులని మార్క్ చేసి ఇచ్చిన చాలని, ఇది వరకే ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారు కూడా ఫామ్ -8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

జిల్లాలో జూన్ 23 నాటికి ఇంటింటి ఓటరు సర్వేను పూర్తి చేసుకోవడం జరి గిందని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వారీగా కొత్తవారిని ఓటరుగా గుర్తించడం, ఓటరు ఫోటోలలో మార్పులు, నూత న పోలింగ్ కేంద్రాల ఏర్పాటు లేదా మార్పు ఇతర సౌకర్యాల కల్పన గురించి జూలై 24లోగా తెలియజేయాలన్నారు. రివిజన్ ఆక్టివిటిలో భాగంగా ఆగస్టు 2న డ్రాప్ట్ ఎలక్టోరోల్ ఏర్పాటు చేసిన అదే రోజు నుండి 31 ఆగస్టు వరకు ఫిర్యాదుల ను స్వీకరించి సెప్టెంబర్ 22 నాటికి అభ్యంతరాలను తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు.

అక్టోబర్ 4న ఫైనల్ ప బ్లికేషన్‌ను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరికి ఓటర్లుగా గుర్తించేలా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, డిగ్రీ, ఇంజనీరింగ్, వైద్య కళాశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ అంతకు ముందు ఈవీఎం గోడౌన్ లో ఎఫ్‌ఎల్‌సీ చెకింగ్‌ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో టైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, శిక్షణ జాయింట్ కలెక్టర్ నవీన్ నికోలస్, డీఆర్డీవో శ్రీలత, తహసిల్దార్ సుధాకర్, డిప్యూటీ తహసిల్దా ర్ తహసీన్, బీఎస్పీ పార్టీ ప్రతినిధి గోలి అనిల్‌కుమార్, బీజేపీ పార్టీ ప్రతినిధి నాంపెల్లి శ్రీనివాస్, సీపీఐ (ఎం) పార్టీ ప్రతినిధి మిల్కూరి వాసుదేవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మోహన్‌చారి, బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధి పి శివ, టీడీపీ పార్టీ ప్రతినిధి ఎర్రవెల్లి రవీందర్, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News