Saturday, December 21, 2024

పొదుపుతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

- Advertisement -
- Advertisement -

కుంటాల : పొదుపుతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలంగాణ గ్రామీ ణ బ్యాంకు చైర్మెన్ శోభ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు నిర్మల్ రిజియన్ ఆధ్వర్యంలో మంగళవారం కల్లూర్‌లో స్వయం సహాయ సంఘాలకు రుణ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ మొత్తం 51 శాఖల ద్వారా 635 గ్రూపులకు రూ. 50 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. బ్యాంకు లావాదేవీలను సద్వినియోగం చేసుకోవాలని, 13 వేలకోట్ల రుణాలు అందజేశామని 25 శాతం 330 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు అందజేసినట్లు తెలిపారు.

పొందిన రుణాలను మహిళా సంఘాల ఎప్పటికప్పుడు చె ల్లిస్తూ తిరిగి రుణాలు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధ్ది చెందాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు సైతం రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంకు డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తుందని, అత్యధికంగా 7.5 శాతం వడ్డీని డిపాజిట్ దారులకు చెల్లించామన్నారు. మహిళా సంఘాలు మరింత అభివృద్ధ్ది చెందినందుకు మరో సంవత్సరానికి రూ. 100 కోట్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం చైర్మెన్ శోభను బ్యాంకు సిబ్బందితో పాటు మహిళా సంఘాలు ఘనంగా సన్మానించారు.

సంఘాల బలోపేతానికి కృషి చేయాలి
మహిళా సంఘాల బలోపేతానికి సంఘ సభ్యులు కృషి చేయాలని డిఆర్‌డివో పిడి విజయలక్ష్మీ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి గొర్రెలు, గేదెల పెంపకంతో పాటు ఇతర పరిశ్రలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. కిరాణా షాపు, హోటల్స్ వాటి ధర ఆదాయ మార్గాలు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సేంద్రియ పద్ధ్దతిలో సాగు విధానం చేయాలన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజినల్ మేనేజర్ డివిఎస్ రామరావు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ సిబ్బంది శివకుమార్, నాగేంధర్ రెడ్డి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌లు రాంచందర్‌తో సంతోష్, పృథ్వి రాజ్, మహిళా సంఘాల సభ్యులు, వివోఏలు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News