కాచిగూడ : అంతర్జాతీయ అండర్ వాటర్ ఫిన్స్ స్విమింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణకు చెందిన గంధం క్వీని విక్టోరియా మరో రజత పతకం సాధించింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో ఈనెల 24నుంచి 27వరకు జరిగిన ఛాం పియన్ షిప్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 38దేశాల నుంచి హాజరయ్యారు. భారతదేశం తరపున స్వీమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో గంధం క్వీని 200 మీటర్ల మహిళల విభాగంలో పాల్గొని 2వ స్థానం నిలిచి మరో రజత పతకం కైవసం చేసుకు ంది.
25వ తేదీన ఆదివారం 400 మీటర్ల మహిళల విభాగంలో గంధం క్వీని పాల్గొని రజత పతకం సాధించిన విషయం తె లిసిందే. హైదరాబాద్ బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన క్వీని విక్టోరియా అంతర్జాతీయ స్వీమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం పట్ల రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. నేడు బుధవారం మధ్యాహ్నం 1గంట వరకు హైదరాబాద్ చేరుకుంటానని ఆమే ఒక ప్రకటనలో తెలిపా రు.