Friday, December 20, 2024

రైతు బాగు కోరే ప్రభుత్వం మాది

- Advertisement -
- Advertisement -

రాయికల్: తెలంగాణ ప్రభుత్వం రైతు బాగు కోరే పాలన సాగిస్తుందని అందుకే రైతుకు పెట్టుబడి సాయం, కోతలు లేని విద్యుత్, సాగు నీరు అం దిస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలో రూ.3కోట్ల50లక్షల వ్యయంతో 5,6,7,12వ వార్డుల్లో నిర్మించే సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఆయన మంగళవారం భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఆయా వార్డుల్లో జరిగిన సమావేశాల్లో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు రాయికల్ మేజర్ గ్రామపంచాయతీని మున్సిపల్‌గా మార్చినట్లు చెప్పారు. పట్టణపరిధిలో రూ. 25కోట్లను మంజూరు చేసి చెరువుల అభివృద్ధి, మున్సిపల్ అభివృద్ధి, పార్కు, డివైడర్, వైకుంటధామం, ఇతర అభివృద్ధి పనులను చేపట్టామని గుర్తు చేసారు.

చాలా వార్డుల్లో సిసిరోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 100కోట్లతో రహదారులను అభివృద్ధి చేసామని, ఆదిలాబాద్ జిల్లాను బోర్నపెల్లి వంతెనతో లింకు కలిపామని వివరించారు. రాయికల్ పట్టణంలో రూ.80కోట్ల నిధులతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పుణ్యక్షేత్రాల సందర్శనకు ఉత్తర భారత్‌కు వెళ్లే యాత్రికులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చర్చించాలని కోరారు. తెలంగాణ సిఎం కెసిఆర్ అన్ని వర్గాల అభివృద్ధే లక్షంగా పని చేస్తున్నారని చెప్పారు.

అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్లులాంటివన్నారు. రాష్ట్రంలో రైతు బంధు ద్వారా రైతులకు రూ.72వేల కోట్ల నిధులను వెచ్చిస్తున్నట్లు చెప్పారు. రాయికల్ పట్టణ పరిధిలోని 18వందల మంది రైతులకు రూ.1 కోటి 50లక్షల సాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్‌పర్శన్ గండ్ర రమాదేవి, కమిషనర్ గంగుల సంతోష్‌కుమార్, సింగిల్‌విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్, ఎఇ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News