Monday, December 23, 2024

ప్రపంచంలో రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ భారత్‌దే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రోడ్ నెట్ వర్క్ కలిగిన దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గత 9 ఏళ్లలో భారతదేశంలో అభివృద్ధి పనులు జరిగాయని ఆయన అన్నారు. గత 9 ఏళ్లలో భారత రోడ్ నెట్‌వర్క్ 59 శాతం వృద్ధి చెంది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా మారిందని తెలిపారు. భారతదేశం దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్ వర్క్ కలిగి ఉందని ఆయన వెల్లడించారు.

ఇది ప్రపంచంంలో రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ అని అన్నారు. 2013-14లో 91,287 కిలోమీటర్ల ఉన్న రోడ్డు వ్యవస్థ ఈ రోజు 1,45,240 కిలోమీటర్లకు చేరిందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రభుత్వానికి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సులో మంగళవారంనాడు ఆయన ప్రసంగించారు. అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రోడ్డు వ్యవస్థ భారత్ లోనే ఉందని, మొదటిస్థానంలో అమెరికా ఉందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News