బెజ్జూరు: ఈ నెల 30న సీఎం కేసిఆర్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి రానుండడంతో ఇంటింటి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. మన జిల్లా నుండే పోడు పట్టాలు పంపిణి కార్యక్రమం చేపట్టడం గర్వించదగ్గ విషయమని, నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో ప్రజలను తరళించేలా కార్యచరణ చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ నెల 30 వ తేదిన సీఎం కేసిఅర్ వస్తున్న శుభసందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్ల కోసం మండల నాయకులతో ఎమ్మెల్యే సమావేశమై చర్చించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పంద్రం పుష్పలత, మండల కోఅప్షన్ సభ్యులు బషరత్‌ఖాన్, ప్రాథమిక సహాకార సంఘం మాజీ చైర్మన్ డోకే వెంకన్న, మండల బిఅర్‌ఎస్ పార్టీ అద్యక్షులు సిడాం సకారం, ప్రాథమిక సహాకార సంఘం చైర్మన్ కుర్సెంగ ఓంప్రకాష్, మాజీ వైస్ చైర్మన్ దందేర ఇస్తారి, మండల బిఅర్‌ఎస్ పార్టీ యూత్ అద్యక్షులు కోండ్ర నరేందర్‌గౌడ్, సర్పంచ్‌లో పోర్తేడి రవి, భూజాడి శేఖర్, తోర్రెం శంకఱ్, ఎంపిటిసిలు లంగారి శ్రీను, బిఅర్‌ఎస్ పార్టీ నాయకులు ఇంజిరి రాజారాం, కోట్రంగి రామృష్ణ, తెలంగాణ జావిద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికి వెళ్లి సీఎం సభకు ఆహ్వానించాలి
- Advertisement -
- Advertisement -
- Advertisement -