Monday, December 23, 2024

రౌడీషీటర్‌కు 20రోజుల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: రాత్రి సమయంలో కత్తితో వీధుల్లో సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న రౌడీషీటర్‌కు ఇరవై రోజు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి ఆరవ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్. లక్ష్మణరావు మంగళవారం తీర్పు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం… మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రౌడీషీటర్ సయ్యద్ షూజత్ అలీ అలియాస్ సజ్జు ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కన్పించాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని త నిఖీ చేయగా అతడి వద్ద కత్తి లభించింది. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి జైలు శిక్ష విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News