ముషీరాబాద్ ః యువత జీవితాన్ని మాధక ద్రవ్యాలు చిదిమేస్తున్నాయని ప్రొగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ హిప్నో పద్మాకమలాకర్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం.. ప్రభావం అనే అంవంపై అశోక్ నగర్‌లోని మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ కార్యాలయంలో మంగళవారం ఉచిత అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో డాక్టర్ హిప్నో పద్మాకమలాకర్ మాట్లాడుతూ పిల్లల్లో క్రీడా స్ఫూర్తి కొరవడటం కారణంగా ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు పిల్లలపై ప్రేమానురాగాలు చూపిం చకపోవడం కూడా చెడు అలవాట్లకు దారితీస్తున్నాయని అన్నారు. ప్రతి 10 మందిలో ఇద్దరు మాధక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడుతు న్నారని, వీరిలో ప్రతి ముగ్గురిలో ఒక మహిళ ఉండటం మరింత ఆంధోళన కలిగిస్తోందన్నారు. ఉద్రేకపడుతూ దేనిపైనా దృష్టి నిలపకపోవడం, వ్యక్తిగత శుభత్రపై శ్రద్ద చూపకపోవడం, మంచి దుస్తులు వేసుకోకపోవడం, మాటలు ముద్ద ముద్దగా మాట్లాడటం, అతిగా తినడం, ఆకలి మంద గించడం వంటి లక్షణాలు కనిపిస్తే డ్రగ్స్ మాయలో చిక్కుకున్నారనే విషయాలను గ్రహించాలన్నారు.