Friday, April 4, 2025

కాంగ్రెస్ సభకు భారీగా తరలిరండి

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : జూలై 2వ తేదిన ఖమ్మం నగరంలో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వంలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభకు కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు అధికసంఖ్యలో తరలిరావలని మాజీ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గోని మాట్లాడారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

కాంగ్రెస్ పార్టీతోనే ఈప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. అనంతరం అభిమానులతో కలిసి ద్విచక్రవాహన ర్యాలీగా బయలుదేరి స్ధానిక జగదాంబసెంటర్‌లోని తెలంగాణ తల్లి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, వైఎస్‌ఆర్ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకముందు మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సందర్భంగా కనకయ్యను సన్మానించి తమ సంపూర్ణ మద్ధతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, చిల్లా శ్రీనివాస్‌రావు, నీలపు రమేష్, పత్తి రంజిత్, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News