Monday, December 23, 2024

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించం

- Advertisement -
- Advertisement -
టిపిసిసి అధ్యక్షుడితో పాటు పలువురిపై రాహుల్‌కు ఫిర్యాదు
మరోసారి బయటపడ్డ అంతర్గత కుమ్ములాటలు
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించం: అధిష్ఠానం హెచ్చరిక

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎదుట తెలంగాణ కాం గ్రెస్ నాయకులు రచ్చ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మక సమావేశం మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులపై కొందరు సీనియర్, జూనియర్ కాంగ్రెస్ నాయకులు అగ్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకున్నట్టుగా తెలిసింది. ప్ర స్తుతం ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న సమయంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయకుండా అంతర్గత కుమ్ములాటలు, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంపై అగ్రనాయకత్వం అందరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం.
క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
దీంతోపాటు తెలంగాణలోని కొందరు వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, మా జీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కొందరు అభ్యంతరం తెలపడాన్ని కూడా అగ్రనాయకత్వం సీరియస్‌గా పరిగణించనట్టు తెలుస్తోంది. దీంతో స్వయంగా రాహుల్‌గాంధీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరూ క్రమశిక్షణలో నడుచుకోవాలని వారికి సూచించినట్టుగా సమాచారం. ఎవరైనా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే వారిపై పార్టీ చర్యలు చేపడుతుందని, పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తాను తెలుసుకుంటున్నానని, తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని వారికి రాహుల్‌గాంధీ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం.
పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో, చేస్తున్నారో తనకు తెలుసని రాహుల్ గాంధీ వారితో పేర్కొన్నారు. విభేదాలు ఉంటే రాష్ట్ర ఇన్‌చార్జీ లేదా తనతో మాట్లాడాలని ఆయన వారికి సూచించారు ఎట్టి పరిస్థితుల్లో బయట మాట్లాడొద్దని, అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుందని రాహుల్ వారితో పేర్కొన్నారు.
తొలుత 20 మంది.. తరువాత 15 మంది
అయితే ఈ సమావేశానికి హాజరయ్యే వారి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం కుదించింది. తొలుత 20 మందికి పైగా తెలంగాణ కాం గ్రెస్ నేతలను ఆహ్వానం అందించినా చివరకు ఆ సంఖ్యను 15కే కుదించింది. దీంతో కొం దరు నేతలు ఈ విషయమై అధిష్టానానికి ఫి ర్యాదు చేశారు. ఈ సమావేశంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపిలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, సీతక్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, పిసి విష్ణునాథ్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News