Monday, December 23, 2024

అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

తుర్కయంజాల్: అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర ముగింపు సభను మంగళవారం సాయంత్రం తుర్కయంజాల్ కూడలీలో నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ప్రజా సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య, జాన్ వేస్లి ముఖ్యఅతిధులుగా హజరై మాట్లాడారు. కూడు, గూడు, గుడ్డ లేని పేదవాడు 20 గజాలలో గుడిసే వెస్తే, వారిపై చర్యలు చేపడుతూ కూల్చీవేస్తున్నారు.

అదే బడా బాబులు వేల ఎకరాలు కబ్జాలు చేస్తే వారిపై ఏలాంటి కేసు ఉండదు, చర్యలు ఉండవని విమర్శించారు. ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, మరియు పేన్షన్‌లు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, వ్యవసాయ శాఖ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, మహిళ సంఘ రాష్ట్ర కార్యదర్ధి మల్లు లక్ష్మి, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఫైళ్ల ఆశయ్య, కోట రమేశ్, భూపాల్, జగదీష్, కాడిగల్ల భాస్కర్, పగడాల యాదయ్య, బోడ సామెల్, చంద్రమోహన్, జగన్, సుమలత, డి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News