- Advertisement -
మునుగోడు: హత్యాయ త్నం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు మునుగోడు ఎస్‌ఐ సిహెచ్. వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని కల్వలపల్లి గ్రామానికి చెందినో మైనర్ బాలుడిపై హత్యాయత్నం జరిగిందని ఆయన తెలిపారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అం దుకు బాధ్యలైన ఉప్పరి సాయి , దాసరి శివకుమార్‌లతో పాటు మరో మైనర్ బాలుడిని అ రెస్టు చేసినట్లు తెలపారు. నిందితులు ఇద్దరిని కోర్టుకు రిమాండ్ చేయడంతోపాటు మైనర్ బాలుడిని జువెనైల్ సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -