Monday, December 16, 2024

కాంగ్రెస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

జక్రాన్‌పల్లి : రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరించి అవినీతి లేని అభివృద్ధి సాధించుకోవాలని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్సీ డా. భూపతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ప్రతి కార్యకర్త సైనికుడిలా గెలుపే లక్షంగా ప్రజలను చైతన్యం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్‌హందాన్, రాష్ట్ర నాయకులు నగేష్ రెడ్డి, ముప్ప గంగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అర్గుల చిన్నారెడ్డి, సొప్పరి వినోద్, గన్నా లక్ష్మన్, వసంత్ రావు, సైకిల్ అక్బర్, నరేష్, డిష్ రాజు, ప్రశాంత్, వెంకటేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News