Sunday, November 17, 2024

30లోగా పంచాయితీ భవన నిర్మాణాలు పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి బ్యూరో: గ్రామ పంచాయితీ భవనాల పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పంచాయితీ భవన నిర్మాణాల పురోగతి, మన ఊరు మన బడి పనుల పురోగతి హరిత హారం, లక్ష రుపాయల సహాయంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన గ్రామ పంచాయితీ భవనాలన్నింటిని గ్రౌండింగ్ చేసి పనులు ఈనెల30లోపు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలన్నారు. స్వచ్చ సర్వేక్షన్ కింద మూడు కేటగీరీలలో 15గ్రామ పంచాయితీలు ఉన్నాయని, ఆయా కేటగిరీలలో ఎలాంటి గ్యాప్స్ లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక అధికారులు చూసుకోవాలన్నారు.

హరిత లక్షాన్నీ పూర్తి చేయాలని, పంచాయితీలు, మున్సిపాల్టీలలో లక్షం మేరకు ప్రణాళికతో మొక్కలు నాటాలన్నారు. హరితహారంలో భాగంగా వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, క్రీడ ప్రాంగాణాలు, పల్లె ప్రకృతి వనాలకు బయో ఫెన్సింగ్ వేయాలని రోడ్ సైడ్ ఏవెన్యూ ప్లాంటేషన్, విద్యా సంస్థలలో నాటిన మొక్కలలో గల గ్యాప్స్ పూర్తి చేయాలన్నారు. ఎంపిడిఓలు, ఎంపిఓలు, పంచాయితీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. బిసిలకు లక్ష రుపాయల ఆర్థిక సహాయం పథకం కింద జిల్లాలో వచ్చిన ప్రతి దరఖాస్థును ప్రాపర్‌గా పరిశీలించాలన్నారు.

ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఈవిషయంలో మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం లక్షాన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని మహిళ సమాఖ్యల ద్వారా చేపట్టిన వైద్యాశాఖ సబ్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణాలపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

మహిళ సమాఖ్యల ద్వారా చేపట్టిన వైద్యశాఖ సబ్‌సెంటర్ బిల్డింగ్స్ నిర్మాణాలపై దృష్టి సారించి త్వరిగతిన పూర్తయ్యేలా చూడాలని డిపిఎంలకు కలెక్టర్ సూచించారు. మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులకు సంబంధించి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో మండలాల వారీగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డిఆర్‌డిఓ శ్రీనివాస్‌రావు, డిపిఓ సురేష్ మోహన్, బిసి సంక్షేమ శాఖ అధికారి జగదీష్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News