కోహీర్ : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే చదువులో ముందుంటారని ప్రథమ స్వచ్ఛంద సంస్థ మండల కో ఆర్డినేటర్ సుధాకర్ అన్నారు. ఈసందర్బంగా ప్రథమ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నాడు మండలంలోని వెంకటపూర్‌లో స్కూల్‌రెడీనెస్ మేళా నిర్వహించారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ సర్కారు బడుల్లోనే మెరుగైన విద్య ఉంటుందన్నారు. అందుకు ఉపాధ్యాయులు బోధించిన విద్యా బోధనను శ్రద్ధ్దగా విని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ మేళాలో 1వ తరగతి వెళ్లడోయే పిల్లు, వారి తల్లులు పాల్గొన్నారు.
స్టాల్ వైస్‌గా వాలంటీర్స్ పిల్లలకు అర్ధమయ్యే విధంగా శారీరక వికాసం, బుద్దివికాసం, భాష వికాసం, పూర్వ గణత తయారీ ఈల పిల్లవాడి యొక్క అన్ని రకాల ఎదుగుదల కోసమే ఈ మేళా నిర్వహిస్తున్నట్లుతెలిపారు. ఇలాంటి ఈవెంట్స్‌లో పాల్గొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ లావణ్య, ప్రధాన ఉపాధ్యాయులు కె. లక్ష్మయ్య, విజయలక్ష్మి, ప్రసన్న లక్ష్మి, విజయలక్ష్మి, ప్రథమ్ సభ్యులు సుధాకర్‌తదితరులు పాల్గొన్నారు.