Saturday, November 23, 2024

మహిళా సంరక్షణ ఇంటికి శ్రీ రామ రక్ష

- Advertisement -
- Advertisement -

చిన్నకోడూరు : మహిళా సంరక్షణ ఇంటికి శ్రీ రామ రక్ష అని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాదాకృష్ణ శర్మ అన్నారు. మంగళవారం చిన్నకోడూరు మండలం అల్లిపురం, మైలారం ,చెర్ల అంకిరెడ్డి పల్లి గ్రామాల్లో మహిళలకు రుతు ప్రేమపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు సహాకారంతో మహిళలందరికి రుతు ప్రేమ కప్పులను అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ప్యాడ్స్ వాడకూడదన్నారు. మెన్స్ వెల్ కప్పులు మాత్రమే వాడుకోవాలనిసూచించారు. ఆ రోగ్యం మహిళ పథకంపై మహిళలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.

తోటి మహిళలకు రుతు ప్రేమపై అవగాహన కల్పించాలన్నారు. మహిళలు ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు వాడకూడదన్నారు. స్టీల్ ప్లేట్లు, గ్లాసులు మాత్రమే వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్‌వనిత రవీందర్ రెడ్డి, ఎంపీపీ ఉపాద్యక్షులు పాపయ్య, డాక్టర్ శాంతికుమారి, సర్పంచ్‌లు రాజా బాయ్ ,కవిత, ఎల్లయ్య సర్ణలత, శ్రీనివాస్, ఎంపీటీసీ లచ్చయ్య, సరిత, పరుశరాములు, ఎపిఎం మహిపాల్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ సోమిరెడ్డి మహిళలు , అధికారులు పాల్గొన్నారు.

రైతు ఖాతాల్లో డబ్బులు జమచేసినందుకు సీఎం కేసీఆర్,మంత్రి హరీశ్‌రావు చిత్ర పటాలకు క్షీరాభిషేకం…
రైతు ఖాతాల్లో డబ్బులు జమచేయడం హర్షించదగ్గ విషయమని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాదాకృష్ణ శర్మ అన్నారు.. మంగళవారం చిన్నకోడూరు మండలం మైలారం గ్రామంలో రైతుల ఖాతాలో రైతు బంధు జమ చేసినందుకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావుల కృషికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటి చైర్మన్ వనిత రవీందర్‌రెడ్డి, ఎంపీపీ ఉపాద్యక్షులు పాపయ్య, సర్పంచ్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News