న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ప్రత్యేక డైరెక్టర్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి అజయ్ భట్నాగర్ నియమితులయ్యారు. 1989 బ్యాచ్‌కు చెందిన జార్ఖండ్ క్యాడర్ ఐపిఎస్ అధికారి అజయ్ భట్నాగర్ ప్రస్తుతం సిబిఐ అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2024 నవంబర్ 20న పదవీ విరమణ చేయనున్న భట్నాగర్ అప్పటివరకు సిబిఐ ప్రత్యేక డైరెక్టర్‌గా కొనసాగుతారని కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం సిబిఐలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న అనురాగ్‌ను సిబిఐలో అదనపు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన ఏడేళ్ల పదవీకాలం 2023 జూలై 24న ముగియనున్నది. అప్పటివరకు ఆయన అదనపు డైరెక్టర్‌గా కొనసాగుతారు.
గుజరాత్ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐపిఎస్ అధికారి మనోజ్ శశిధర్ సిబిఐలో అదనపు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన సిబిఐలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నారు.