హసన్‌పర్తి: సిఎం కెసిఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేయడమే లక్షంగా కృషి చేస్తు న్నామని బిఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. ఎర్రగట్టు గుట్ట కేఎల్‌ఎన్ కన్వెన్షన్‌లో మండల ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వీలైనంత తొందరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో గ్రామాలు, డివిజన్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటిప్పుడు అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో గ్రామాలను అభివృద్ధికి ప్రతీకలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం మండ లంలోని పలు గ్రామాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 3,61,500 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచడమే లక్షం
- Advertisement -
- Advertisement -
- Advertisement -