Friday, December 27, 2024

స్వయం ఉపాధి రుణాలపై అవగాహన కల్పించాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : యువత, మహిళలకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న స్వయం ఉపాధి రుణాలు అవకాశాలపై అవగాహన కల్పించి సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం వనపర్తి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ, సంప్రదింపుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మెన్ లోక్‌నాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి, ప్రతి వ్యాపార లావాదేవీలు బ్యాంకుతో అనుసంధానం అయి డిజిటల్ లావాదేవీలు జరిగే వి ధంగా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తుందని వాటిని రుణాలు అందించి ఉపాధి పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ బ్యాంకర్లను సూచించారు.

ఈ సందర్భంగా సమావేశంలో గత సంవత్సరానికి సంబంధించి మార్చి, 2023 నాల్గవ త్రైమాసికంలో నిర్దేశించుకున్న లక్షాలు, సాధించిన ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మెన్ ఆర్.లోక్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో బ్యాంకులు తమ లక్షాలు బాగానే సాధిస్తున్నాయి కానీ జిల్లా ప్రజలు ఇంకా ఆశించిన స్థాయిలో లబ్ధి పొందలేకపోతున్నారని అన్నారు. బ్యా ంకర్లు తమకు నిబంధనలు ఉన్నప్పటికి కాస్త ధైర్యం చేసి నూతన లబ్ధిదారులను ప్రోత్సహించి రుణాలు మంజూరు చేయాలని సూచించారు.

లావాదేవీలు పెంచుకోవడం ద్వారానే బ్యాంకులు లా భాలు అర్జిస్థాయని, అదే విధంగా మేనేజర్లు మంచి పేరు తెచ్చుకుంటారని అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, ఆర్‌బిఐ యాల్‌డిఓ వైభవ్ వ్యాస్, నాబార్డ్ డిడిఎం ష ణ్ముఖ చారి, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆమోల్ పవార్, డిక్కి కో ఆర్డినేటర్ సోమశేఖర్, ఎస్‌బిఐ కంట్రోలర్ వెంకటేశ్వర్లు, యూ నియన్ బ్యాంకు నుండి శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News