Monday, December 23, 2024

బెటాలియన్స్‌లో సౌకర్యాలు కల్పించేందుకు కృషి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని బెటాలియన్ల అభివృద్ధిలో సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తుందని బెటాలియన్స్ డిజి స్వాతి లక్రా అన్నారు. బుధవారం నల్గొండ పట్టణ పరిధిలోని అన్నెపర్తిలో ఉన్న 12వ బెటాలియన్‌ను ఆమె సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం బెటాయిలియన్‌లో ఫిష్ పోండ్, స్వాతిలక్రా చిల్డ్రన్ పార్కును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ అడిషినల్ డీజీగా పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకున్న తర్వాత నల్గొండ బెటాలియన్ సందర్శించడం ఇదే ప్రథమం అని పోలీస్ సిబ్బంది కష్టపడి పనిచేయాలని బెటాలియన్‌కు మంచి పేరు తీసుకురావాలన్నారు. కమాండెంట్ సాంబయ్య ఆధ్వ ర్యంలో బెటాలియన్ల డెవలప్ చేయడంతో పాటు నర్సరీలు, పార్కులు అద్భుతంగా ఉన్నా యన్నారు. అతి త్వరలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వ ర్యంలో ఈ బెటాలియన్లు 300 మంది ఎస్సీటీపీసీలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చే యాలన్నారు.

అందు కోసం గ్రౌండ్ సిద్ధం చేయడంతో పాటు క్లాస్ రూమ్‌లను, కిచెన్లను లైబ్రరరీలను అందుబాటులోకి తెచ్చుకోవాలన్నారు. ఇలాంటి అభివృద్ధి కావాలన్నా నిధులు కేటాయిస్తామని బెటాలియన్‌లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. బెటాలియన్లు ప్రభుత్వ పాఠశాల కూడా అద్బుతంగా ఉందని ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్దతో విద్యార్థులకు తరగతులు బోధించడం సంతో షకరమన్నారు. పాఠశాలను కూడా తమ వెల్పేర్ తరుపున చూసుకుంటామన్నారు.

ఆమె వెంట జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు, బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సాంబయ్య, కమా ండెంట్ సూపర్డెంట్ అండ్ ఎన్ వెంకన్న, అడిషినల్ కమాండెంట్లు అసిస్టెంట్ కమాండెంట్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News