Tuesday, January 21, 2025

తుంగతుర్తి ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : గడిచిన 9 సంవత్సరాలలో తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడానికి తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో నేడు తుంగతుర్తి ప్రగతి నివేదన బహిరంగ సభకు ఏర్పాటు పూర్తి చేశారు. బుధవారం సభా ప్రాంగణాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ పరిశీలించారు. మున్సిపాలిటీ కేంద్రంలో 29 సాయంత్రం నాలుగు గంటలకు రూ. 50కోట్లకు పైగా నిధులతో నూతన మున్సిపాలిటీ భవనానికి, టౌన్ హాల్‌కు, డంపింగ్ యార్డ్, సిసి రోడ్లు, డ్రైనేజీలు, సమీకృత మార్కెట్లకు రాష్త్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు.

వినాయక ఆలయం నుంచి సుమారు 4000 మంది వివిధ కళాకారులచే భారీ ర్యాలీ నిర్వహిస్తూ సభాస్థలి వరకు స్వాగతం పలకనున్నారు. నియోజకరవ్గం 9 మండలాల నుంచి సుమారు 40వేల మందిని తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ఆయా గ్రామాలకు వాహనాలను పంపించే పనులు చేపట్టినారు. సభా ప్రాంగణం నాలుగు వైపులా వాహనాల పార్కింగ్‌కు ఏర్పాటు చేసినారు. తెలంగాణ చౌరస్తాలో గులాబీ తోరణాలకు కట్టి గులాబీమయం చేశారు. సభా ప్రాంగణంలో అవసరమైన వసతులు కల్పించడం కోసం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ తగు చర్యలు తీసుకున్నారు. ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ చేసిన అభివృద్ధి పనులకు ప్రజలకు వివరించనున్నారు.

2014 ముందు నియోజకవర్గంలో ఉన్న పరిస్థులు ప్రస్తుతం 9 ఏళ్లలో ఉన్న పరిస్థితులకు తేడాను వివరిస్తూ ఇంకా జరగవలసిన అభివృద్ధి పనులకు మంత్రులకు అభ్యర్ధించి నిధులు తీసుకురావడం కోసం కృషి చేయనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేసి నామని చెప్పనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం అద్భుతంగా తీర్చిదిద్ది అభివృద్ధిపరిచి వ్యాపార వాణిజ్య విద్య వైద్య పరంగా ఎంతో అభివృద్ధి సమృద్ధిగా చేసినామని గణా ంకాలతో సహా చెప్పనున్నారు. సభ విజయవంతం కోసం తగు ఏర్పాట్లు చేసుకున్నారు. మంత్రుల రాకతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News