Wednesday, January 22, 2025

మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్షం

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి : మహిళల అభ్యున్నతి బిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షమని స్థానిక ఎమ్మెల్యే జాజాల సురెందర్ పేర్కొన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో మహిళలకు రూ. 58 లక్షల 6728ల విలువ గల షాది ముబారక్, కళ్యాణలక్ష్మీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధ్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

నియోజకవర్గ కే్ంర దంలో రూ,15.00 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు,రూ 5.00 కోట్లతో ఆర్టిసీ బస్టాండ్ నిర్మాణ పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. గతంలో ఎవరు చేపట్టని పెద్ద చెరువు కట్టపై బ్రిడ్జీల నిర్మాణం అతి తక్కువ కాలంలో పూర్తి చేసి చూపించడం జరిగిందన్నారు. ప్రజలకు అత్యవసరమైన డయాలసిస్ కేంద్రాన్ని ప్రభుత్వ ఆసుప్ర ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.

ఈ కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, జెడ్పిటిసీ సభ్యుడు ఉషా గౌ డ్, ఏఎంసీ చైర్మన్ కాశీనారాయణ,మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపిటిసీలు, సర్పంచ్లు, పిఏసిఎస్ చైర్మన్లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News