Saturday, December 21, 2024

మెడికల్ కాలేజీలో బోధించే ప్రొఫెసర్ల కోసం క్వార్టర్ల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: భూపాలపల్లిలోని మెడికల్ కాలేజీలో బోధించడానికి నియమితులైన ప్రొఫెసర్ల కోసం సింగరేణి రామప్ప క్వార్టర్స్‌లోని 3 బ్లాక్‌లను కేటాయించడం జరిగిందని, ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సింగరేణి జిఎంతో కలిసి క్వార్టర్స్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు క్వార్టర్స్‌లలో వారికి కావాల్సిన మౌళిక వసతులను, మెస్‌ను నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ సింగరేణి అధికారులను కోరారు.

ఇందులో భాగంగా మహిళా ప్రొఫెసర్‌లకు, పురుషులకు వేరు వేరుగా క్వార్టర్స్‌ను కేటాయించడం జరిగిందని, అందరికి ఒకే మెస్ కాకుండా వేరు వేరుగా భోజన వసతి కల్పించాలని కలెక్టర్ అన్నారు. క్వార్టర్స్‌లో వారికి కావాల్సిన మౌళిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని సింగరేణి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, రాజు దేవుడే, సింగరేణి జిఎం శ్రీనివాసరావు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, సింగరేణి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News