Monday, December 23, 2024

గ్రామాల అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -
- Advertisement -
  • సర్పంచ్ చంద్ర గౌడ్ కృషి అభినందనీయం
  • ఎమ్మెల్యే మదన్ రెడ్డి

హత్నూర: గ్రామ అభివృద్ధికి ప్రభుత్వేతర సంస్థల సహకారంతో గ్రామాలను అభివృద్ధి బాటలో తీర్చిదిద్దిన సర్పంచ్ చంద్ర గౌడ్ కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. హత్నూర మండలం తుర్కల ఖానాపూర్, తాహర్ ఖాన్ పెట్ గ్రామాల్లో నిర్మించిన సిసి రోడ్లు, అంగన్‌వాడీ భవనం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను బుధవారం ప్రారంభించారు.అనంతరం నూతనంగా మంజూరైన గ్రామపంచాయతీ భవనం, యాదవ, ముదిరాజ్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డిలను నాయకులు గ్రామస్తులు వాహనంపై ఊరేగిస్తూ ఆటపాటలతో భారీ గజమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పల్లెకు అందించాలనే రాష్ట్రం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించి పూర్తిస్థాయిలో సిసి రోడ్లు స్థానికంగా ఉన్న పరిశ్రమ సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంగన్‌వాడీ భవన నిర్మాణ కృషికి అభినందనీయమన్నారు. అంతేకాకుండా నూతనంగా మంజూరైన గ్రామపంచాయతీ భవనం, యాదవులకు, ముదిరాజులకు వేరువేరు కమ్యూనిటీ భవనం త్వరలో నిర్మాణాలు పూర్తవుతాయని పేర్కొన్నారు. మునుముందు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అందించే ప్రతి పైసా సక్రమంగా వినియోగించుకొని గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆంజనేయులు, కాసాల, హత్నూర పిఎసిఎస్ చైర్మన్లు దుర్గారెడ్డి,దామోదర్ రెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు శివ శంకర్ రావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, తుర్కల ఖానాపూర్ ఎంపిటిసి మీనంపల్లి కిషన్ రావు, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి,రామచంద్రారెడ్డి, పండుగ రవి,ఆశయ్య ఎంపిటిసిలు, సర్పంచులు నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News