- Advertisement -
పటాన్ చెరు: పటాన్‌చెరు పట్టణంలో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి భవనానికి సిఎం కెసిఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేయించిన సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని యాదవ సంఘం నేతృత్తంలో బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షుడు మెకల వెంకటేశ్ మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గ చిరకాల ఆకాంక్ష సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్యే జిఎంఆర్ చేసిన కృషి పటాన్‌చెరు ప్రాంత వాసులు మరువలేనిదన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక వాడలో పని చేస్తున్న కార్మికులకు ఆ ఆసుపత్రితో ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ పెద్ద గొలల్ మల్లేశ్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, దండు మల్లేశ్ యాదవ్, యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -