Monday, December 23, 2024

మండల పరిషత్ ప్రహరీ శిలాఫలకానికే పరిమితం

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాది తరువాత సెప్టెంబర్ 5,2015లో రూ. 6లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన నాంపల్లి మండల పరిషత్ ప్రహరీగోడ నిర్మాణ పనులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి కార్యాలయ ఆవరణలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్తుల సమక్షంలో శిలాఫలకం వేశారు. శంకుస్థాపన శిలాఫలకం వేసి 8సంవత్సరాలు కావస్తున్నా నేటి వరకు ప్రహరీ గోడ పనులకు పునాదులుకూడా తీయలేదు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి,స్థానిక ఎమ్మెల్యే,ఎంపిపి.జెడ్పీటిసి, ఎంపిటిసి, సర్పంచ్ ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు తరచూ మండల పరిషత్‌లో జరిగే సభలు, సమావేశాలకు శిలాఫలకం పక్కనుండే రాకపోకలు సాగిస్తుండటం తప్ప ప్రహరీగోడ నిర్మించాలనే ద్యాస ఏ కోశాన కనిపించడంలేదని నాంపల్లి పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 8సంవత్సరాల క్రితం ప్రహరీగోడ నిర్మాణానికి 6లక్షల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ నుండి కేటాయించగా పనులు ప్రారంభం కాకపోవడంతో అంచనా వ్యయం ప్రస్తుత రేట్ల ప్రకారం 20 లక్షలకు పైగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత మండల పరిషత్ కార్యాలయానికి రాష్ట్ర మంత్రి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకుపోవడంతో శిలాఫలకం కార్యాలయానికి వచ్చిపోయే వారిని వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ,అధికారులు ప్రహరీగోడ నిర్మాణానికి అంచనా వ్యయం పెంచి పనులు యుద్ధ్దప్రాతిపధికన పూర్తిచేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అధికారులు , ప్రజా ప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలిమరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News