Monday, November 25, 2024

ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. గత నాలుగు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మ మునుపెన్నడూ లేని విధంగా అన్ని రకాల కూయగాయల ధరలు అల్ టైం రిక్డారును నమోదు చేస్తున్నాయి. అల్లం ధరలు వింటేనే గొంతు గరగరలాడిపోతోంది. కిలో అల్లం రూ.250కి చేరింది. కిలో పచ్చి మిరప ధర రూ.120 దాటేసింది. కొన్ని చోట్ల చిల్లర విక్రయాలతో వీటి ధర రూ.200 చేరింది.ఇప్పటికే టమాటా ధరలు పేలిపోతున్నాయి. వందనోటు కొడితేగాని కిలో టామాటాలు సంచిలో పడనంటున్నాయి.

మరో రెండు రోజులు పోతే వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దొండధరలు కూడా దడదడ లాడిస్తున్నాయి. కిలో 15నుంచి 20రూపాయల లోపు లభించే దొండకాయల ధర కూడ మూడు రెట్లకు పైగా పెరిగి రూ.60కి చేరుకుంది. మిగిలిన కూరగాయలు , ఆకు కూరల ధరలు కూడా కుతకుతలాడుతున్నాయి. వివిధ పట్టణాల్లోని కూరగాయల మార్కెట్లలో వీటి ధరలు రూ.5-10 తేడాతో విక్రయిస్తున్నారు. బీరకాయలు రూ.120, కాకర కాయలు రూ.80, టామాటాలు రూ.100, బెండకాయలు రూ.50,వంకాయలు రూ.50, చిక్కుడు రూ.80, గోరు చిక్కుడు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. ఆకు కూరల ధరలు కూడా అదే విధంగా మండిపోతున్నాయి. కట్ట పాలకూర రూ.60కి చేరింది. ఇతర ఆకు కూరల ధరలు ఆదే దారిలో ఉన్నాయి. కట్ట కొత్తిమీర రూ.100కు చేరింది. కాలిప్లవర్ రూ.70, క్యాబేజి రూ.50, కాప్సికం రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. అల్లం ధరలు ఇప్పటికే కొండెక్కి కూర్చున్నాయి . కిలో అల్లం గత పదిరోజులుగా రూ.180నుంచి 200 పలుకుతోంది.

దిగుబడిని దెబ్బతీసిన రుతుపవనాలు
నైరుతి రుతుపవానాలు కూరగాయ పంటల దిగుబడిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ ఏడాది వేసవిలో మూడు నెలల పాటు ఎండలు విశ్వరూపం చూపాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పైర్ల ఎదుగుదల మందగించి ఆ ప్రభావం ఉత్పత్తిపైన పడింది. జూన్ మొదటి వారంలో రావాల్సిన రుతుపవనాలు జాప్యం కారణంగా వర్షాలు అలస్యం అయ్యాయి. రావాల్సిన సమయం కంటే సుమారు రెండు వారాలు వర్షాలు జాప్యం చేశాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితి కారణంగా పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. టామాటా పంటను అధికంగా సాగు చేసే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,తమిళనాడు, మధ్యప్రదేశ్ , ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రతికూల వాతావరణం పంటదిగుబడిని దెబ్బతీసింది. గుజరాత్‌లో బిపోర్‌జొయ్ తుపాను కూరగాయల తొటలను చిద్రం చేసింది.

మహారాష్ట్ర , కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ట్రాలీ ఆటోల ద్వారా హైదరాబాద్ మార్కెట్‌ను ముంచెత్తే టామాటా విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ రాష్ట్రాలనుంచి వచే ట్రాలీ ఆటోలు గత రెండు రోజులుగా ఎక్కడా కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని పత్తికొండ, రాయఛోటి, మదనపల్లి , కదిరి తదితర ప్రాంతాలనుంచి హైదరాబాద్ కు వచ్చే టమాటా రవాణ మందగించింది. మైదుకూరు ప్రాంతాల నుంచి వచ్చే ఆకు కూరల రవాణ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కూరగాయల మార్కెట్లు వినియోగదారులకు చుక్కులు చూపుతున్నాయి. వివిధ రాష్ట్రాల మధ్యన కూరగాయాల దిగుమతి , రవాణలను పర్యవేక్షిస్తూ ధరల నియంత్రణను ఆదుపులో ఉంచాల్సిన కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ పరిస్థితుల్లో మరికొన్ని రోజుల పాటు కూరగాయల ధరాఘాతానికి వినియోగదారులు గురికాక తప్పదంటున్నారు.

నియంత్రణ బాధ్యతే కేంద్రానిదే
కూరగాయలు ఇతర నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధమైన సంబంధం ఉండదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామప్ప బుధవారం వెల్లడించారు. ఉత్పత్తి, రవాణ , వాటి పర్యవేక్షణ , ధరల నియంత్రణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. గత రెండు వారాలుగా ధరల పెరుగుదలను పరిశీలిస్తూనే ఉన్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన వెలువడ లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News