Monday, December 23, 2024

అపన్న హస్తం కోసం ఎదురుచూపు

- Advertisement -
- Advertisement -

బెజ్జూరు: బెజ్జూరు మండల కేంద్రానికి చెందిన నానబోయిన తారక్క గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేకపోవడంతో ఇంటి వద్దనే ఉండిపోయింది. నేడు మహారాష్ట్రలోని ఓ ప్రవేట్ అసుపత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించగా ఆమెకు కాలేయం, కిడ్నిలపై ఇన్ఫేక్షన్ రావడం జరిగిందని, సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు.

ఇంత మొత్తం అమె వద్ద లేకపోవడంతో దాతలు అర్థిక సాయం చేయాలని చేతులు జోడించి ప్రార్థించింది. తారక్కకు అర్థిక సహాయం అందించవలసిన వారు ఈ క్రింది నెంబర్లకు తమ అర్థిక సహాయాన్ని పంపించి దాని స్క్రిన్‌షాట్‌ను వాట్సాఅప్‌లో పెట్టాలని అన్నారు. తెలంగాణ జావిద్ ఫోన్‌పే 6300005645, పురం వైకుంఠం యాదవ్ గూగుల్‌పే 6303154617 నెంబర్‌లకు పంపించాలని కొరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News