Friday, December 20, 2024

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లక్షెట్టిపేట: మున్సిపల్ పరిధిలోని శ్రీ సత్యసాయి నగర్‌లో రాథోడ్ శివసాయి (16) అనే యువకుడు మద్యానికి బానిసై ఆత్మహ త్య చేసుకొని మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గత సంవత్సర కాలంగా మద్యానికి అలవాటు పడ్డాడు.

ఇంట్లో వారు మద్యం మానుకోవాలని మందలించినా కూడా మద్యం సేవిం చడం మానుకోలేదు. అంతే కాకుండా మద్యం అలవాటు మానుకోమని చెబితే ఆత్మహత్య చేసుకొని చనిపోతానని బెధిరించేవాడ న్నారు. గతంలో మద్యం మానుకోవాలని కుటుంబ సభ్యులు చెబితే ఇంట్లో ఉన్న ఫనాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడగా ఆసుపత్రికి తరలించి బతికించుకున్నారు.

అదే క్రమంలో మంగళవారం రాత్రి కూడా అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు మానుకోమని చెప్పగా మానస్థాపం చెంది అందరు పడుకున్న తర్వాత సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాథోడ్ రాంసింగ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News