Monday, December 23, 2024

జులై మూడోవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర సర్కార్ రంగం సిద్ధం చేసింది. జులై మూడో వారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే కచ్చితంగా ఏ తేదీ నుంచి ప్రారంభం అవుతాయో అధికారికంగా ప్రకటించలేదు. జులై 17 లేదా 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 10 నాటికి ముగుస్తాయని ఆయా వర్గాల సమాచారం. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఒకటి, రెండు రోజుల్లో వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈసారి సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లపై ప్రధానంగా వాడివేడిగా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా రోజుల నుంచి మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు, వాటిపై కేంద్ర వైఖరిని గట్టిగా ప్రశ్నించడానికి విపక్షాలు సిద్ధం అవుతున్నాయి. అదానీ హిండెన్‌బర్గ్ నివేదికపై కూడా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీసే పరిస్థితి కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News