హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) మరో నిర్వాకం బయటపడింది. గ్రూప్4 పరీక్షల్లో ఒకే అభ్యర్థి పేరిట రెండు హాల్‌టికెట్లు జారీ అవ్వడం విస్మయాన్ని కలిగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన ధరావత్ నవ్యశ్రీ పేరుతో జారీ చేసిన హాల్‌టికెట్ (2193432645)లో పరీక్షా కేంద్రం కొత్తగూడెంలోని శ్రీ నలంద జూనియర్ కళాశాల అని, అదే హాల్ టికెట్ నంబర్‌తో మరొకటి దక్కన్ ఇంజినీరింగ్ కళాశాల, అఘాపురా, హైదరాబాద్ అని చూపించింది. ఒకే అభ్యర్థికి వచ్చిన
రెండు హాల్‌టికెట్లలో ఒకటి నకిలీదని తేలింది పేపర్ లీకేజీ ఆరోపణలతో హీటెక్కుతున్న టిఎస్‌పిఎస్‌సికి తలనొప్పిగా మారిన రెండు హాల్ టిక్కెట్ల ఎపిసోడ్ వైరల్ కావడంతో, జూలై 1, 2023న పరీక్ష సమీపిస్తుండడంతో ఇలాంటి పొరపాటుకు కారణాలను టిఎస్‌పిఎస్‌సి వెతకడం ప్రారంభించింది. అనంతర వెరిఫికేషన్‌లో కొత్తగూడెం సెంట ర్ హాల్‌టికెట్ ఒరిజినల్ అని, మరొకటి హైదరాబాద్ హాల్‌టికెట్ నకిలీదని తేలిందని కమిషన్ తన ప్రకనటలో పేర్కొంది. దానిపై ముద్రించిన కేంద్రం కల్పించబడిందని, ఈ విషయం విచారణలో ఉందని కమిషన్ వెల్లడించింది.