Saturday, January 11, 2025

సాగునీటి ప్రాజెక్టులు వెలవెల !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నైరుతి రుతుపవనాల జాప్యం కారణంగా కృష్ణా, గోదావరి తదితర ప్రధాన నదుల పరివాహకంగా వర్షాలు ఇంకా పుంజుకోలేదు. అరకోర వర్షాలు నెర్రెలిచ్చిన నేలల్లో ఏమూలకు కనిపించటం లేదు. నేల పదునెక్కి వర్షపు నీరు పొలాలలో దొర్లి వాగులు వంకలు పొర్లితో తప్ప నదుల్లో నీటి ప్రవాహాలు ప్రారంభం కావు .జూన్ ఒకటి నుంచి ఈ ఏడాది వర్షాకాలం ప్రారభమై అప్పుడే నెల రోజులు గడిచిపోవస్తోంది. నీటిపారుదల రంగం పరిస్థితి చూస్తే ప్రధాన సాగు నీటి ప్రాజెక్టులు కనిష్ట స్థాయికి పడిపోయాయి. రిజర్వాయర్లలో నీటి నిలువలు అడుగంటి వెలవెల బోతున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే గత ఏడాది కంటే 66టిఎంసీల మేరకు నీటి నిలువలు తక్కువగా ఉన్నాయి. గత ఏడాది జూన్ 28నాటికి అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో మొత్తం 423టిఎంసీల నీరు నిలువ ఉండగా,

బుధవారం నాటి నీటి మట్టాలను పరిశీలిస్తే వీటిలో 357టిఎంసీల మేరకు మాత్రమే నీటి నిలువలు ఉన్నట్టు కేంద్ర జలవనరుల సంఘం వెల్లడించింది.కృష్ణానది పరివాహకంగా తెలుగు రాష్ట్రాల పరిధిలోని ప్రధాన ప్రాజెక్టులో నీటి నిలువలు మరింత తరిగిపోయాయి. జూరాల ప్రాజెక్టులో గత ఏడాది 7.91టిఎంసీలు నిలువ ఉండగా ,ఈ ఏడాది ఇందులో 7.51టిఎంసీలు నిలువ ఉన్నాయి.తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 808అడుగుల డెడ్‌స్టోరేజికి చేరుకుంది. గత ఏడాది ఈ సమయానికి ఈ ప్రాజెక్టులో నీటిమట్టం 823ఆడుగుల స్థాయిలో ఉండేది. నీటి నిలువ కూడా గత ఏడాది ఈ సమయానికి 43టిఎంసీలు ఉండగా, ప్రస్తుతం ఇందులో 33టిఎంసీలు మాత్రమే నిలువ ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.

దిగువన నాగార్జు సాగర్‌ప్రాజెక్టులో గత ఏడాది ఈ సమయానికి 173టిఎంసీల నీరు నిలువ ఉండేది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 148టిఎంసీల నీరు మాత్రమే నిలువ ఉన్నట్టు అధికారులు తెలిపారు. దిగువన పులిచింతల ప్రాజెక్టులో గత ఏడాది 30టిఎంసీలు ఉండగా , ప్రస్తుతం ఇందులో 30టిఎంసీల నీరు నిలువ ఉంది. ప్రకాశం బ్యారేజిలో గత ఏడాది 3.07టిఎంసీలు ఉండగా , ప్రస్తుతం ఇందులో 2.96టిఎంసీల నీరు నిలువ ఉంది. గోదావరి నదీ పరివాహకంగా ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకుంది. అయితే ఇటీవల కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి మోటార్ల ద్వారా గోదావరి నదీజలాల ఎత్తిపోత ప్రారంభం కావటంతో కొన్ని ప్రాజెక్టుల్లో నీటినిలువుల ఇప్పడిప్పుడే మెరుగు పడుతూ వస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టులో గత ఏడాది 18.87టిఎంసీల నీరు నిలువ వుండగా , ప్రస్తుతం ఈ పాజెక్టులో 17టిఎంసీల నీరు నిలువ ఉంది. నిజాంసాగర్‌లో గత ఏడాది 5.78టిఎంసీలు నిలువ ఉండేది.

ప్రస్తతం ఇందులో 4టిఎంసీలు మాత్రమే నిలువ ఉంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో గత ఏడాది ఈ సమయానికి 22.76టిఎంసీల నీరు నిలువ ఉండగా , ప్రస్తుతం ఇందులో 20.07టిఎంసీలు నిలువ ఉంది. మిడ్‌మానేరులో గత ఏడాది 7.43టిఎంసీలు నిలువ వుండగా , ప్రస్తుతం ఇందులో 18.43టిఎంసీలు నిలువ ఉంది. లోయర్ మానేరులో గత ఏడాది 9.40టిఎంసీలు నిలువ ఉండగా , ప్రస్తుతం ఇందులో 7.33టిఎంసీల నీరు నిలువ ఉంది. కడెం ప్రాజెక్టులో గత ఏడాది 3.41టిఎంసీలు నిలువ వుండగా , ప్రస్తుతం 3.92టిఎంసీల నీరు నిలువ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గత ఏడాది 8.49టిఎంసీలనీరు నిలువ ఉండగా, ప్రస్తుతం ఇందులో 11.99టిఎంసీల నీరు నిలువ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News