Saturday, December 21, 2024

గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) విడుదల చేసింది. అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లను టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 2,33,056 మంది అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచినట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది.ఈ ఒఎంఆర్ షీట్లు జులై 27 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొంది. గ్రూప్ ప్రిలిమ్స్ ప్రాథమిక కీ పై జులై 1 నుంచి జులై 5 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే అభ్యంతరాలు తెలపాలని కమిషన్ చెప్పింది. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కాగా, ఈ నెల 11వ తేదీన మళ్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను టిఎస్‌పిఎస్‌సి పగడ్భంధీగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇతర వివరాలకు టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్ చూడవచ్చు.
త్వరలో ఫలితాలు
గ్రూప్1 ప్రిలిమరీ ప్రాథమిక కీని విడుదల చేసిన టిఎస్‌పిఎస్‌సి, త్వరలోనే ప్రిలిమరీ ఫలితాలు విడుదల చేయనుంది. ఈ ప్రక్రియను జులై నెలలో పూర్తి చేసి, మూడు నెలల సమయం ఇచ్చి ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేయనుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరు నెలల్లో గ్రూప్ -1 ప్రధాన పరీక్ష ఉండనున్నట్లు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం ఇతర పరీక్షలు ఉండడంతో..

ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రూప్-1 పరీక్షలో భద్రతా పరమైన కీలక అంశాలను ఎందుకు విస్మరించారని హైకోర్టు టిఎస్‌పిఎస్‌సిని వివరణ కోరింది. బయో మెట్రిక్ తీసుకోకపోవడం, ఒఎంఆర్ షీట్‌లో ఫొటో, సంతకం లేకపోవడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై మూడు వారాల్లో పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News