Monday, December 23, 2024

గవర్నర్‌కు మంచి కనిపిస్తలేదా?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళిపై చేసిన వ్యాఖ్యలు విచారకరమని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించైనా గవర్నర్ చెప్పారా? అని ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవ నం కట్టాలని 2015లోనే ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీ సుకున్నారని, రూ.200 కోట్లు ప్రకటించారన్నారు. కానీ దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం ఈ విష యం న్యాయస్థానం పరిధిలో ఉందని తెలిపారు. కొత్త భవ నం నిర్మించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఐఐటి హైదరాబాద్ నిపుణులతో ఇండిపెండెంట్ కమిటీని వేశామని, ఆ కమిటీ కూడా భ వనం ఆసుపత్రి నిర్వహణకు పనికిరాదని నివేదిక ఇచ్చిందని అన్నారు. ప్రభుత్వం కూడా కోర్టులో అదే విషయం చెప్పిందని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నామన్నారు.

గవర్నర్ ఈ విషయాలన్నీ పక్కనపెట్టి కోడిగు డ్డు మీద ఈకలు పీకినట్టు, భూతద్దం పెట్టి వెతుకుతూ రాజకీయంగా బురదజల్లే వ్యాఖ్యలు చేయడం బాధాకరమని వ్యా ఖ్యానించారు. ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్‌లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై బిజెపి అధికార ప్రతినిధిలా మా ట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై.. బిజెపి అధికార ప్రతినిధిలా మాట్లాడడం దురదృష్టకరమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రా ష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేపడుతున్నా ఒక్కసారి కూడా మొచ్చుకుంటూ ట్వీట్ చేయని గవర్నర్.. ప్రభుత్వంపై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చే స్తున్నారంటూ మండిపడ్డారు. వైద్య రంగానికి సంబంధించి కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నామని తెలిపా రు. గవర్నర్ తమ పాలనలో చెడు మాత్రమే గవర్నర్ చూస్తా రా? చెడు మాత్రమే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. కంటి వెలుగులాంటి కార్యక్రమాన్ని మెచ్చుకునేందుకు గవర్నర్‌కు మనసురాలేదని ఆరోపించారు.

నిమ్స్ బెడ్ల పెంపుపై ఆమె ఒ క్క ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు? అని నిలదీశారు. మా తా శిశుమరణాలు తగ్గించడంలో రాష్ట్రం అగ్రభాగాన ఉందని నీతి ఆయోగ్ చెబితే గవర్నర్‌కు అది కనిపించలేదంటూ విమర్శించారు. మంచి కనబడదు.. వినబడదు అనేరీతిలో గవర్న ర్ తమిళిసై వ్యవహారశైలి ఉందని మంత్రి మండిపడ్డారు. రా ష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వెబ్‌సైట్‌ను బుధవారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా కోఠిలోని నూతన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
తమ ప్రభుత్వం చేసిన మంచి పనులపై గవర్నర్ ఎందుకు స్పందించలేదు..?
ప్రపంచమే అబ్బురపడేలా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించించిందని,100 రోజుల్లో 1.62 కోట్ల మందికి పరీక్షలు చేసి, 45 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని అభినందించడానికి ఎందుకు గవర్నర్‌కు మనసు రాలేదని అన్నారు. నిమ్స్ ఆస్పత్రిని కొత్తగా 2000 పడకలతో విస్తరిస్తున్నా…గవర్నర్ దీనిపై కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదని పేర్కొన్నారు. కెసిఆర్ కిట్, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ వంటి కార్యక్రమాలు అమలు చేసి, ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు పెంచి మాతా శిశు మరణాలను 43కు తగ్గించామని, ప్రభుత్వ దావకానాల్లో డెలివరీలను 30 శాతం నుండి 70 శాతానికి పెంచామని తెలిపారు. 2014తో పోల్చితే సీన్ రివర్స్ అయ్యిందని, ఇవేమీ గవర్నర్‌కు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు.

దేశంలో 100 శాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పిందని, అయినా గవర్నర్ ఎందుకు అభినందించలేదని నిలదీశారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అనే స్థితి నుంచి నేను వస్తా బిడ్డ సర్కార్ దవాఖానకు అనే స్థాయికి చేర్చిన విషయం ఆమెకు కనిపించడం లేదా..? అని అడిగారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజి దేశంలోనే ఒక చరిత్ర అని మంత్రి పేర్కొన్నారు. గతంలో 20 ఏళ్లకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే సిఎం కెసిఆర్ 9 ఏళ్లలోనే 21 కాలేజీలను ఏర్పాటు చేశారని, ఈ విషయంపై గవర్నర్ ఎందుకు స్పందించలేదని అన్నారు. లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని, ఒక డాక్టర్‌గా కనీసం ఈ విషయంలోనైనా గవర్నర్ అభినందించాలి కదా..?

అని, ప్రశంసిస్తే తాము ఇంకా ఉత్సాహవంతంగా పనిచేస్తాం కదా అని పేర్కొన్నారు. డయాలసిస్ సెంటర్లు గతంలో మూడు ఉంటే 102కు పెంచామని, గాంధీ, నిమ్స్, ఉస్మానియాలో పేదలకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా అవయవ మార్పిడి చేస్తున్నామని, వైద్యుల మనోధైర్యం పెంచేలా అభినందిస్తూ గవర్నర్ ఒక్క మాట కూడా ఎందుకు అనరని అడిగారు. బస్తీ దవాఖానాలను నీతి అయోగ్ సైతం ప్రశంసించిందని, వీటి ఏర్పాటుతో గాంధీ, ఉస్మానియా నిమ్స్, ఫీవర్ హాస్పిటల్ వంటి పెద్ద ఆసుపత్రులపై చిన్న చిన్న సమస్యలతో ఒపికి వచ్చే రోగులు తగ్గారని, దాంతో సర్జరీలు, ఇతర చికిత్సలపై వైద్యులు దృష్టి పెట్టగలుగుతున్నారని, ఇది గవర్నర్‌కు ఎందుకు కనబడదని నిలదీశారు. ఒక వైద్యురాలు అయి ఉండి.. తెలంగాణ వైద్యులు చేసిన కృషి కనిపించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 ఫ్యాకో యంత్రాల ఏర్పాటు
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు.. అంతటి ముఖ్యమైన కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. స్కూల్‌కు వెళ్లే విద్యార్థి నుంచి, పండుముసలి వరకు కంటి సమస్యలతో బాధపడుతుంటారని చెప్పారు. చిన్న సమస్యే కదా అని వదిలేస్తూ.. కాలం గడుపుతుంటారని, చివరకు అది పెద్ద సమస్యకు దారి తీస్తుందన్నారు. దీన్ని దృష్టిలోఉంచుకొని సిఎం కెసిఆర్ కంటివెలుగు అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, విజయవంతంగా అమలు చేశారని వెల్లడించారు. సరోజినీదేవి కంటి దవాఖానలో ఫ్యాకో మెషీన్లను మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్యాకో యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

కాటరాక్ట్ సర్జరీల నిర్వహణలో ఈ అత్యాధునిక యంత్రాలు ఎంతో సహాయం చేస్తాయని తెలిపారు. అల్ట్రాసౌండ్ పరిజ్ఞానంతో పనిచేసే వీటి ద్వారా సర్జరీలు సులభంగా, వేగంగా చేసేందుకు అవకాశం లభిస్తుందని, సర్జరీ తర్వాత రోగులు కూడా తొందరగా కోలుకుంటారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 ఫ్యాకో యంత్రాలను ఏర్పాటు చేశామని, వీటన్నింటినీ ఇప్పుడు ఒకేసారి ప్రారంభించుకున్నామని వెల్లడించారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో కూడా రెండు మెషిన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, వికారాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో ఒక్కో యంత్రం అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఒక్కో ఫ్యాకో యంత్రం ఖరీదు రూ.28.85 లక్షలు అనీ, మొత్తంగా 12 యంత్రాలకు కలిపి ప్రభుత్వం రూ.3.46 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.

ప్రైవేటులో రూ.30 నుంచి రూ.40 వేలు ఖర్చయ్యే సర్జరీలు పేదలకు ఉచితంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సర్జరీ నిర్వహించడానికి వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించామన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి సమస్యలు గుర్తించిన వారికి ఈ ఫ్యాకో మిషన్ల ద్వారా అవసరమైన చికిత్స అందనుందని తెలిపారు.
కంటి పరీక్షల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వానిది ఆల్ టైం రికార్డు
అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం ప్రారంభించిన కంటి వెలుగు.. రెండు దఫాల్లో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఎవరూ అడగకముందే, ఇంటి పెద్దకొడుకుగా ఆలోచించిన సిఎం కెసిఆర్ ప్రజల కంటి సమస్యలను దూరం చేసేందుకు ఈగొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రామాలకు వైద్య సిబ్బంది వచ్చి.. ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో తెలంగాణలో మినహా మరెక్కడా లేదని అన్నారు. 100 పని దినాల్లో కోటి 62 లక్షల మందికి కంటి పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో దృష్టి లోపం ఉన్న 40.59 లక్షల మందికి అంటే 25.1 శాతం మందికి అద్దాలు పంపిణీ చేశామని, అందులో 22.51 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు అందించామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News