- అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి
మేడ్చల్ జిల్లా: టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో జులై 1న నిర్వహించే గ్రూప్4 పరీక్షలను సజావుగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌తో కలిసి గ్రూప్4 పరీక్షల సన్నద్దతపై సంబంధత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్4 పరీక్షలకు జిల్లాలో మొ త్తం 90,220 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారని, ఇందుకు జిల్లా వ్యాప్తంగా 187 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ నియమ నిబంధనల మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్‌లు ముందుగా పరీక్ష కేంద్రాలను సందర్శించి త్రాగునీరు, సీటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటును, ఇతర మౌలిక వసతులను సరి చూసుకోవాలని అన్నారు.
పరీక్ష రోజు కేం ద్రా ల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని, అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఆశ, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉం చాలని, పోలీసు బందోబస్తూ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు. అభ్యర్ధులను క్షుణ ంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాలలోకి అనుమతించాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించవద్దని చెప్పారు. పోలీసు బందోబస్తూతో స్ట్రాంగ్ రూమ్ నుండి పరీక్ష కేంద్రాలకు ప్రశ్నా పత్రాలను తరలించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్, లైజనింగ్, రూట్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.