Saturday, December 21, 2024

మాదక ద్రవ్య రహిత సమాజమే ధ్యేయంగా కృషి

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో : మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకుని మాదక ద్రవ్యాల దుర్వినియెగానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సెం ట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌తో గ్రాన్యూల్స్ ఇండియా చేతులు కలిపింది. మాదకద్రవ్య రహిత సమాజమే లక్షంగా కృషి చేస్తున్న నార్కోటిక్స్ బ్యూరో దార్శనీకతకు తోడ్పాటును అందిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప లు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా బుధవారం నగరంలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనార్థాలపై వీధి నాటకం ప్రదర్శించారు. అదే విధంగా మాదక ద్ర వ్యాల దుర్వినియోగంపై ప్రత్యేక క్విజ్ నిర్వహించడంతో పాటు ఆరోగ్య ని పుణులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సె ంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్ కమిషనర్ దినేష్‌బౌద్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రాన్యూల్స్ ఇం డి యా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చిరుగుపాటి కృష్ణ మాట్లాడుతూ మన స మాజాన్ని పీడిస్తున్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యను ఎదుర్కొవడంలో తమ సంస్థ ఎళ్లవేళాలా సహాయ సహకారాలను అందిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News