Saturday, November 23, 2024

8 ఏళ్లలో మూడు రెట్లు పెరిగిన బంధన్ బ్యాంక్ శాఖలు

- Advertisement -
- Advertisement -

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకుల్లో ఒకటైన బంధన్ బ్యాంక్, 8 సంవత్సరాల కంటే తక్కువ కాలంలోనే తన శాఖల సంఖ్యను మూడు రెట్లు పెంచటం ద్వారా వినూత్నమైన మైలురాయి ని చేరుకుంది. బ్యాంక్ ఇప్పుడు మొత్తం 1,500 కంటే ఎక్కువ బ్యాంకు శాఖలను కలిగి ఉంది. బ్యాంక్ ఇప్పటికే కలిగి ఉన్న మరో 4,500 బ్యాంకింగ్ యూనిట్ల నెట్‌వర్క్‌తో, మొత్తం బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల సంఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా 6,000 ను అధిగమించాయి . ఆగస్టు 23, 2015న 501 శాఖలతో బ్యాంక్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

బ్యాంక్ ప్రస్తుతం భారతదేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 6,000 బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల యొక్క బలమైన నెట్‌వర్క్ ద్వారా 3 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. వినియోగదారులు ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, వారికి ఏ ఆర్థిక ఉత్పత్తి అవసరం లేదా వారు ఏ బ్యాంకింగ్ ఛానెల్‌ని ఇష్టపడవచ్చు – భౌతిక లేదా డిజిటల్ అనే వాటితో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి యొక్క విభిన్న ఆర్థిక అవసరాలను నెరవేర్చడానికి ఇది కట్టుబడి ఉంది.

ఎండి & సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ మాట్లాడుతూ.. “బంధన్ బ్యాంక్‌ ఈ రోజు ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది . గడిచిన ఎనిమిదేళ్లలో బ్యాంక్ యొక్క వేగవంతమైన వృద్ధి దేశంలోని ప్రతి మూలకు చెందిన కస్టమర్‌ ల నుండి తిరిగి పొందుతున్న విశ్వాసం, నమ్మకం ఫలితంగా ఉంది. ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్‌కు తగిన అవకాశాలు పొంది ఉండేలా చూడడానికి భారతదేశ వ్యాప్తం గా బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ లు ప్రవేశించాల్సిన అవసరం వుంది . వేగంగా అభివృద్ధి చెందుతున్న మా బ్రాంచ్ నెట్‌వర్క్, డిజిటల్ ఆఫర్‌లతో, మా విలువైన కస్టమర్‌ల సౌలభ్యం, భద్రత, అవకాశాలను మరింత మెరుగుపరచడానికి బంధన్ బ్యాంక్ కట్టుబడి ఉంది.” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News