Monday, January 20, 2025

పెళ్లి కుమార్తె తండ్రిని చంపిన పక్కింటి యువకుడు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: పెళ్లి కూతురు తండ్రిని పక్కింటి యువకుడు హత్య చేసిన సంఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కల్లంబలం ప్రాంతంలో రాజు(61) అనే వ్యక్తి తన కమార్తెకు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం చేశాడు. రాజు పక్కింట్లో జిష్ణు అనే యువకుడు ఉన్నాడు. తనకు రాజు కూతురుని పెళ్లి చేసుకుంటానని పలుమార్లు అడగడంతో రాజు అంగీకరించలేదు. జిష్ణుకు నేర చరిత్ర ఉండడంతో అతడికి దూరంగా ఉండాలని రాజు నిర్ణయం తీసుకున్నాడు. ఇది మనసులో పెట్టుకొని జిష్ణు తన సోదరుడు జిజిన్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాజుపై దాడికి దిగారు. అడ్డువచ్చిన రాజు కూతురు, తల్లిపై కూడా దాడి చేశారు. రాజు తలపై పారతో పలుమార్లు బాదడంతో అతడు తీవ్రంగా గాయపడి చనిపోయాడు. రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: సాయిచంద్ మృతిపట్ల మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News