Monday, November 18, 2024

జులై 13-14 తేదీలలో బెంగళూరులో ప్రతిపక్షాల రెండవ ఐక్య సమావేశం

- Advertisement -
- Advertisement -

ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్న లక్షంతో ఏర్పాటు చేస్తున్న బిజెపియేతర ప్రతిపక్షాల రెండవ సమావేశం జులై 13–14 తేదీలలో బెంగళూరులో జరగనున్నది. గతంలో నిర్ణయించినట్లు సిమ్లాలో కాకుండా బెంగళూరులో రెండవ సమావేశాన్ని నిర్ణయించినట్లు ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ గురువారం వెల్లడించారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించడమే ఏకైక లక్షంగా జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో పాట్నాలో జరిగిన తొలి సమావేశం ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రాథమికంగా చర్చించింది. తొలి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్ థాక్రే) నాయకుడు ఉద్ధవ్ థాక్రే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ఆర్‌జెపి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఓమర్ అబ్దుల్లా, పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తి తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News