హైదరాబాద్: పౌరసరఫరాల శాఖలో వినూత్న మార్పులు తీసుకొచ్చామని మంత్రి కారమూరి నాగేశ్వర్ రావు తెలిపారు. గురువారం మంత్రి కారమూరి మీడియాతో మాట్లాడారు. జూలై 1నుంచి తెలంగాణ వ్యాప్తంగా పౌరసరఫరాల దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ గోధుమ పిండిని సరఫరా చేస్తున్నామన్నారు. రైతుల నుంచి నేరుగా రాగులు కొనుగోలు చేస్తున్నామని, దళారీ వ్యవస్థకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని, టిడిపి హయాంలోనే పౌరసరఫరాల విభాగం నిధులను అడ్డదారిలో పసుపుకుంకుమ పేరుతో వాడుకున్నారని మండిపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేసేందుకు జనసేన అధినేత పవన్ తాపత్రయం పడుతున్నాడని, తాటతీస్తా, తోలుతీస్తా అనేది పవన్ మేనిఫెస్టోలో ఉందన్నారు. టిడిపి నేత లోకేష్ ఓ వేస్ట్ అని, అతడి గురించి మాట్లాడే స్థాయి తనది కాదన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితులో లేరని కారమూరి దుయ్యబట్టారు.
Also Read: జితేందర్ రెడ్డి ట్వీట్ పై వ్యంగ్యంగా స్పందించిన రేవంత్ రెడ్డి